థానే మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కీల‌క నిర్ణ‌యం: వ్యాక్సిన్ తీసుకోకుంటే…

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ప్ప‌టికీ మూడో వేవ్ ప్ర‌మాదాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌ల్లో వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మంద‌కోడిగా సాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ, తీసుకోవ‌డానికి కొంత‌మంది ఇష్ట‌ప‌డ‌టం లేదు. వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్ర‌మాదం అధికంగా ఉండే అవ‌కాశం ఉంటుంది.

Read: త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…

ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని, థానే మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ్యాక్సినేష‌న్‌కు దూరంగా ఉండే ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌కూడ‌ద‌ని, సింగిల్ డోసు తీసుకొని సెకండ్ డోసు తీసుకోని వారికి కూడా జీతాలు చెల్లించ‌రాద‌ని థానే మున్సిప‌ల్ కార్పోరేష‌న్ స్ప‌ష్టం చేసింది. విధిగా ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్‌ను మున్సిప‌ల్ కార్యాల‌యాల్లో స‌మ‌ర్పించాల‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Related Articles

Latest Articles