తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావు !

శ్రీకాకుళం : టీడీపీ నేత కూన రవికుమార్ కు మరో సారి స్పీకర్‌ తమ్మినేని కౌంటర్ ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో తనకు తెలుసని.. తాను కచ్చితంగా ఆ పంథాలో వెళతానని తెలిపారు. గట్టిగా నోరుపెడితే బెదిరిపోయేవాడిని కాదని.. వంద కాదు వెయ్యి అడుగులైనా ముందు కెళతానని స్పష్టం చేశారు.

read also : ఏపీలో 1184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ : ఏపీపీఎస్సీ

వామనావతారుడి మాదిరి భూమిలోకి తొక్కేస్తానని… అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తమ్మినేని ముందు మీ అరుపులు , కేకలు పనికిరావని… మంచి చేసుకుని వెళదాం…లేనిపోని అరుపులు దేనికి? ప్రశ్నించారు. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం….మళ్లీ ఎన్నికలొచ్చాక తిట్టుకుందామన్నారు. ఎవరి ముక్కుకు మసి అంటుకుందో ప్రజలు తేలుస్తారని స్పష్టం చేశారు. నాయకులకు అంత అహంకారం, అహంభావం పనికిరాదని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-