రాఘవ లారెన్స్ చిత్రానికి తమన్ సంగీతం!

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు ఎస్. ఎస్. తమన్. వరుసగా తెలుగు సినిమాలు చేస్తూనే కాస్తంత సమయం దొరికితే చాలు కోలీవుడ్ పైనా కన్నేస్తున్నాడు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ చిత్రానికి మరోసారి మ్యూజిక్ చేసే ఛాన్స్ తమన్ కు దక్కింది. ప్రముఖ దర్శకుడు వెట్రీ మారన్.. రాఘవ లారెన్స్ కాంబోలో ‘అధికారం’ అనే సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి వెట్రి మారన్ కథను అందిస్తుంటే… దురై సెంథిల్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. ఎస్. కార్తికేశన్ తో కలిసి వెట్రి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Read Also : అతియా, రాహుల్ లవ్ స్టోరీ : కూతురుకి నచ్చాడు, నాన్న మెచ్చాడు!

గతంలో రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన ‘కాంచన, కాంచన 2’ చిత్రాలకు తమన్ సంగీతం అందించాడు. అలానే పి. వాసు డైరెక్షన్ లో లారెన్స్ హీరోగా నటించిన ‘శివలింగ’ చిత్రానికీ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ ను వెంట్రిమారన్ రిపీట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. నేచురాలిటీకి దగ్గర, రగ్గడ్ గా వెట్రి మారన్ చిత్రాలు ఉంటాయి. ఇక లారెన్స్ అయితే మాస్ ఆడియెన్స్ ను, ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టి పెట్టుకుని సినిమాలు చేస్తుంటాడు. వీరిద్దరి కాంబినేషన్ లో దురై తీసే సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-