బాలయ్య సినిమాకు గతంలోనే పనిచేశా: తమన్

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మూవీకి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న తమన్ సంగీతం సమకూర్చాడు. ఈ సందర్భంగా తమన్ తన అనుభవాలను పంచుకున్నాడు. అఖండ సినిమాకు పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమన్నాడు తమన్. బాలయ్యలో చాలా ఎనర్జీ ఉందని… ఈ మూవీలో ఆయన డ్యాన్సులు చూస్తే తనకు మతిపోయిందని తమన్ తెలిపాడు.

Read Also: బాలయ్య బాబు ఒక ఆటంబాంబ్ – ఎస్.ఎస్ రాజమౌళి

బాలయ్య సినిమాకు తాను గతంలోనే పనిచేశానని తమన్ వెల్లడించాడు. బాలయ్య నటించిన భైరవద్వీపం సినిమాకు గతంలో తాను ఓ సన్నివేశానికి సంబంధించి డ్రమ్స్ వాయించానని.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చిందని తమన్ తెలిపాడు. ఈ మూవీలో మాస్ సాంగ్స్ ఉండవని.. అయినా అన్ని పాటలు అభిమానులను అలరిస్తాయని స్పష్టం చేశాడు. ఈ మూవీలో 70 గూస్‌బంప్స్ సన్నివేశాలు ఉంటే అందులో 50 సీన్‌లకు ప్రేక్షకులు లేచి నిలబడతారని తమన్ పేర్కొన్నాడు. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.

Related Articles

Latest Articles