థమన్ అవుట్ హిప్ హాప్ ఇన్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా పూర్తి చేసిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం రాబోయే స్పై థ్రిల్లర్ ‘ఏజెంట్’ పని మీద ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా జరుగుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ముందుగా తమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. అయితే ఒప్పుకున్న కమిట్స్ మెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్న తమన్ యూనిట్ కి అందుబాటులో లేక పోవడంతో ‘ఏజెంట్’ మేకర్స్ మ్యూజిక్ కంపోజర్‌ని మార్చినట్లు వినిపిస్తోంది.

ఈ సినిమాకోసం తమిళ సంగీత దర్శకుడు ‘హిప్‌హాప్ తమిళ’ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచన చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సరెండర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర దీపా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. విడుదలైన లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఇక అఖిల్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ లవ్ డ్రామాలో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

Related Articles

Latest Articles

-Advertisement-