క్రేజీ టాక్ : ఇండియన్ ఐడల్ జడ్జ్ గా సింగర్ థమన్

తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్‌ కూడా ఈ షోలో కన్పించబోతున్నాడు. అయితే ఈ షోకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also : ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్

సింగింగ్ రియాలిటీ షో “తెలుగు ఇండియన్ ఐడల్”లో ఓ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జడ్జ్ గా కన్పించబోతున్నారట. ఈ పాపులర్ షోలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ ఉంటుందని అంటున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ షోకు జడ్జిగా వ్యవహరించబోతున్నారు అనే టాక్ నడుస్తోంది ఇప్పుడు. థమన్ ను మేకర్స్ దాదాపు కన్ఫర్మ్ చేసిఅన్తతు తెలుస్తోంది. ప్రస్తుతం థమన్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నారు. ఇటీవలే ‘అఖండ’ చిత్రం విజయ సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరోవైపు ‘భీమ్లా నాయక్’లో థమన్ మ్యూజిక్ దుమ్మురేపుతోంది. ఇక ‘సర్కారు వారి పాట’తో పాటు పలు భారీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.

Related Articles

Latest Articles