బాలుడి తలకు గాయం.. సినిమా చూపించి వైద్యం

తలకు తీవ్ర గాయమైన బాలుడు చికిత్సకు నిరాకరించడంతో సినిమా చూపించి ట్రీట్మెంట్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మైలాపూర్‌కు చెందిన శశి అనే కుర్రాడు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, తలకి రక్తస్రావం కాకుండా కుట్లు వేయాలని వైద్యులు సూచించారు. కాగా, చికిత్స కోసం మత్తు ఇంజక్షన్‌ ఇస్తున్న సమయంలో విపరీతమైన భయంతో బాలుడు ఏడ్చాడు. వైద్యులు చాకచక్యంగా బాలుడిని మాటల్లో పెట్టి.. ఏ హీరో ఇష్టమో తెలుసుకున్నారు. అనంతరం బాలుడికి ఫోన్‌లో హీరో విజయ్‌ ‘బిగిల్‌’ సినిమా చూపించిన వైద్యులు.. బాలుడు సినిమాలో లీనం కాగానే విజయవంతంగా చికిత్స చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-