హీరో విజయ్ ఇంట్లో బాంబ్ కలకలం.. ?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త కలకలం రేపుతోంది. విజయ్ ఇంట్లో బాంబ్ పెట్టినట్లు చెన్నై పోలీసులకు కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నైలోని విజయ్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఆకతాయి ఇలాంటి ఫేక్ ఫోన్ కాల్ చేసినట్లు అనుమానించిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని విళ్లుపురం జిల్లా మరక్కాణం గ్రామానికి చెందిన భువనేశ్వర్‌ అనే యువకుడిగా గుర్తించారు. యువకుడికి మతిస్థిమితం లేదని, అందుకే ఇలాంటి పని చేసినట్లు పోలీసులు వివరించారు. ఇక ఈ విషయం తెలియడంతో విజయ్ అభిమానులు కొద్దిగా ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ‘బీస్ట్’ చిత్రంలో నటిస్తున్నాడు

Related Articles

Latest Articles