వలిమై: అజిత్‌కు తగ్గ విలన్ పోస్టర్ విడుదల

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వాలిమై’.. అజిత్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయనకు జోడిగా హుమా ఖురేషి నటిస్తోంది. అగ్ర నిర్మాత బోని కపూర్ – జీ స్టూడియోస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ‘వాలిమై’ చిత్రబృందం విషెస్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కార్తికేయ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. అజిత్‌కి తగ్గ విలన్ గా సెట్ అయ్యాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

-Advertisement-వలిమై: అజిత్‌కు తగ్గ విలన్ పోస్టర్ విడుదల

Related Articles

Latest Articles