సైమా అవార్డ్స్ 2021: వేడుకలో టాలీవుడ్ తారల సందడి

(సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) సైమా-2021 అవార్డ్స్‌ లో సౌత్‌ సినిమా సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ వేడుకలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. అందాల ముద్దుగుమ్మలు స్టైలిష్‌ డ్రెస్‌లలో స్టేజీపై హొయలు పోయారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ఈ వేదికపైన అవార్డ్స్ స్వీకరించారు. ఇక టాలీవుడ్ తారలు అవార్డ్స్ తో సందడి సందడి చేశారు. కరోనా కారణంగా గత ఏడాది సైమా అవార్డ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

2019వ సంవత్సరానికిగానూ టాలీవుడ్‌కు సంబంధించి విజేతల వివరాలు..

  • ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
  • ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
  • ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మిక మందన్న (డియర్ కామ్రేడ్)
  • ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
  • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
  • ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
  • ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్షి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
  • ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
  • ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
  • ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
  • ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
  • ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్‌జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
  • ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
Image
-Advertisement-సైమా అవార్డ్స్ 2021: వేడుకలో టాలీవుడ్ తారల సందడి

Related Articles

Latest Articles