దారుణం: మాస్క్ పెట్టుకున్నారని… రెస్టారెంట్ నుంచి గెంటేశారట…!!

ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు.  అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే.  ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.  కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు.  వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది.  చాలా రెస్టారెంట్లు మాస్క్ లేకుంటే లోనికి అనుమతించడం లేదు.  కానీ, టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ లో మాత్రం మాస్క్ ఉంటె అనుమతించడం లేదట.  ఓ జంట తన చిన్న చిన్నపిల్లవాడిని తీసుకొని రెస్టారెంట్ కు వెళ్లారు.  అలా రెస్టారెంట్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి చేదు అనుభవం ఎదురైంది.  మాస్క్ తీసేయాలని లేదా బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది కోరారు.  తాము వాక్సిన్ తీసుకున్నామని, చిన్న పిల్లవాడికి ఇంకా వాక్సిన్ ఇవ్వలేదు కాబట్టి మాస్క్ ధరించాల్సి వచ్చిందని చెప్పినా వినలేదని, నిర్ధాక్షిణ్యంగా బయటకు వెళ్లిపోవాలని కోరారని ఆవేదనను వ్యక్తం చేశారు ఆ జంట.  

Read: పాక్ కొత్త మెలిక:  సార్క్ సదస్సుకు తాలిబన్లను పిలవాలి 

-Advertisement-దారుణం: మాస్క్ పెట్టుకున్నారని... రెస్టారెంట్ నుంచి గెంటేశారట...!!

Related Articles

Latest Articles