ఎల‌న్ మ‌స్క్‌కు అనుకోని చిక్కులు… టెస్లాను వెంట‌నే మూసేయండంటూ…!!

ప్రపంచ‌కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ కు చెందిన టెస్లా కంపెనీ చిక్కుల్లో ప‌డింది. ఇటీవ‌లే టెస్లా కంపెనీ చెందిన షోరూమ్‌ను చైనాలో లాంచ్ చేశారు.  జిన్ జియాంగ్ ప్రావిన్స్‌లోని ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభించారు.  ఉరుమ్‌కిలోలో షోరూమ్‌ను ప్రారంభిస్తున్న‌ట్టు ఎల‌న్ మ‌స్క్ విబోలో ప్ర‌క‌టించాడు.  దీనిపై ఇప్పుడు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  అమెరికాకు చెందిన ప‌లు వాణిజ్య సంస్థ‌లు, అంత‌ర్జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘాలు ఎల‌న్ మ‌స్క్ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి.  

Read: కోడి పందాలపై హైకోర్టులో పిటిషన్‌.. ఈసారి ఉంటాయా?

ఉరుమ్‌కిలోలో మైనారీటీలు, మైనారిటీ ముస్లీంల‌పై చాలా కాలంగా దాడులు జ‌రుగుతున్నాయి.  వారిని అక్క‌డ బానిస‌లు మాదిరిగా చూస్తున్నారు.  జిన్ జియాంగ్‌లోని మైనారిటీల‌పై దాడుల‌ను నిర‌సిస్తూ ఫిబ్ర‌వ‌రిలో చైనాలో జ‌రిగే వింట‌ర్ ఒలింపిక్స్‌ను బ‌హిష్క‌రించాల‌ని చూస్తున్నాయి.  ఈ స‌మ‌యంలో ఎల‌న్ మ‌స్క్ చైనాలో షోరూమ్‌ను ఏర్పాటు చేయ‌డంతో ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  

Related Articles

Latest Articles