తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌…

వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తారు. మ‌ధ్యాహ్నం నుంచి క్యూలైన్లో క్యూలైన్లో వేచి ఉన్నా త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భ‌క్తులు ఆందోళ‌నను వ్య‌క్తం చేస్తూ మ‌హాద్వారం వ‌ద్ద ధ‌ర్నాకు దిగారు.  టీటీడీ చైర్మ‌న్‌, అధికారుల‌కు వ్య‌తిరేకంగా భ‌క్తులు నినాదాలు చేశారు.  వీవీఐపీల‌కే ప్ర‌ధాన్య‌త ఇస్తున్నార‌ని, సామాన్య భ‌క్తుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, సామాన్య భక్తులంటే టీటీడీకి లెక్క‌లేదా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  క‌నీసం అన్నం, నీళ్లు ఇవ్వ‌లేదంటూ భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  త‌మ ఇబ్బందుల గురించి అధికారులుగాని, సిబ్బందిగాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని భ‌క్తులు వాపోయారు.  మ‌హాద్వారం వ‌ద్ద ధ‌ర్నా చేస్తున్న భ‌క్తుల‌ను పోలీసులు అక్కడి నుంచి త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి.  భ‌క్తుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది.  

Read:

Related Articles

Latest Articles