తాడేప‌ల్లిలో టెన్ష‌న్‌… సీఎం నివాసం ముట్ట‌డికి విద్యార్ధుల య‌త్నం…

తాడేప‌ల్లిలో సిఎం వైఎస్ జ‌గ‌న్ ఇంటి వ‌ద్ద టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది.  జాబ్ క్యాలెండ‌ర్‌కు నిర‌స‌నగా విద్యార్ధి సంఘాలు ఛ‌లో తాడేప‌ల్లి కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం జ‌గ‌న్ ఇంటిని ముట్ట‌డికి విద్యార్ధి సంఘాలు ప్ర‌య‌త్నం చేశాయి.  సీఎం వైఎస్ జ‌గ‌న్ నివాసం వైపు వెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ద్య తోపులాట జ‌రగింది.  ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇక‌, సీఎం నివాసం వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు.  ఎలాంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తులే లేవ‌ని విద్యార్ధులు త‌మ నిర‌సన‌లు నిలిపివేయాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: మెగా ఫోన్ పట్టబోతున్న మరో కమెడియన్

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-