కరీంన ‘గరం’.. బండి సంజయ్ జాగరణ దీక్షలో ఉద్రిక్తత

కరీం నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారీగా మోహరించారు పోలీసులు.

డౌన్ డౌన్ కేసీఆర్ అని మహిళా నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు. జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో సంజయ్ జాగరణ దీక్షకు పూనుకున్నారు. కాసేపట్లో బండి సంజయ్ జాగరణ దీక్షకు కూర్చోనున్నారు. దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.ఇదిలా వుంటే.. బీజేపీ రాష్ట్ర నాయకులు టి.వీరేందర్ గౌడ్, ఎన్వీ సుభాష్ తో కలిసి కరీంనగర్ చేరుకున్నారు బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్. కరీంనగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంవైపు బయలు దేరారు కె.లక్ష్మణ్. అయితే దీక్ష చేసి తీరుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు పోలీసుల వలయాన్ని చేధించుకుని ద్విచక్ర వాహనంపై క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి ‘జాగరణ’ దీక్ష చేస్తున్నారు బండి సంజయ్ కుమార్.

Related Articles

Latest Articles