మంత్రి సబిత ఇంటి వద్ద ఉద్రిక్తత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అయితే తాజాగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

బదిలీలకు నిరసన జూనియర్‌ లెక్చరర్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోలనకు దిగారు. బదిలీల్లో న్యాయం చేయాలని మంత్రి సబిత ఇంటి ముందు జూనియర్‌ లెక్టరర్లు బైఠాయించారు. బదిలీల్లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్‌ చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

Related Articles

Latest Articles