అద్భుతం… ఈ యువకుడి టాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే..!!

గతంలో యూఎస్ కళాకారుడు రెండు చేతులతో ఒకేసారి రెండు బొమ్మలు గీయడం చూసి భారతదేశానికి చెందిన నురూల్ హాసన్ ఎంతో స్ఫూర్తి పొందాడు. దీంతో ఏకంగా యూఎస్ కళాకారుడికే ఛాలెంజ్ విసిరి ఒకే చేత్తో ఏకకాలంలో నాలుగు రకాల బొమ్మలు గీసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యస్వంత్ అందరినీ అబ్బురపరిచే విధంగా తనదైన రీతిలో రెండు చేతులు, రెండు కాళ్ళతో ఏకకాలంలో మొత్తం 12 బొమ్మల్ని గీసి వారెవ్వా అనిపిస్తున్నాడు. దీంతో దాసరి యస్వంత్ ప్రతిభను చూసిన పలువురు అతడి ముందు అద్భుతం అనే పదం కూడా చిన్నదైపోతుందని అభిప్రాయపడుతున్నారు.

దాసరి యశ్వంత్ తన చిత్రలేఖనం ప్రతిభతో ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న దాసరి యశ్వంత్‌ ఆర్ట్‌ వర్క్‌లో నిష్నాతుడు. గత ఏడాది జూన్‌లో తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో సోనూ సూద్ 2,938 అడుగుల చిత్రాన్ని 2 గంటల 57 నిమిషాలలో పూర్తి చేసి ఒకేసారి 12 వరల్డ్‌ రికార్డులు సాధించాడు. సేవా స్టేట్ రత్న అవార్డును కూడా దక్కించుకున్నాడు. అంతేకాకుండా నాలుకతో పవన్ కళ్యాణ్, సోనూసూద్ బొమ్మలను కూడా వేశాడు.

Related Articles

Latest Articles