పెరుగుతున్న కేసులు.. అక్కడ మళ్లీ లాక్‌డౌన్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ముప్పు తగ్గుతుందని భావిస్తున్న వేళ.. మరోసారి కరోనా వైరస్ మహమ్మారి ప్రజలపై విరుచుకుపడుతోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే రష్యా, జర్మనీ వంటి దేశాలలో ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో రోజుకు 15వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Read Also: బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్ సీన్స్.. వీడియోలు ఉన్నాయంటున్న హీరోయిన్

వచ్చే సోమవారం (నవంబర్ 22) నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్న కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆస్ట్రియా ఛాన్సిలర్ అలెగ్జాండర్ షాలెన్ బర్గ్ వెల్లడించారు. అందుకే 10 రోజుల పాటు దేశంలో లాక్‌డౌన్ పెడుతున్నామని.. అనంతరం కరోనా వ్యాప్తిని బట్టి లాక్‌డౌన్‌ పొడిగించాలా లేదా అన్న విషయంపై ఆలోచిస్తామన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే భారీగా జారిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అటు యూరప్ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్ రేటు నమోదైన దేశాల్లో ఆస్ట్రియా ఒకటి. టీకాలు వేసుకోవాలని తాము ఎంత ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయామని ఆ దేశ అధికారులు చెప్తున్నారు.

Related Articles

Latest Articles