ఓ ‘రేంజ్’లో ఉండబోతున్న యాక్షన్ ఎంటర్ టైనర్!

జెమిని ప్రొడక్షన్ సంస్థ యువ ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందించడానికి సిద్ధమైంది. అందులో భాగంగా సరికొత్త కథాంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు నిర్మిస్తోంది. తాజాగా ఆ సంస్థ సహకారంతో గుడాల నవీన్ ‘రేంజ్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న ఈ డిఫ‌రెంట్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లో యంగ్ హీరో చైతన్య వంశీ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హేమంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బుధవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి జెమిని సీఈఓ పీవీఆర్ మూర్తి క్లాప్ నిచ్చారు. ఈ చిత్రానికి రేంజ్ అనే టైటిల్ తో పాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్‌లో వంశీ ర‌క్తంలో త‌డిసి యాక్ష‌న్ అవ‌తారంలో కనిపిస్తున్నాడు. అతడి చేతిలో చైన్ సా ఉంది. ‘రేంజ్’ అనే టైటిల్ బట్టి ఇది ఓ హై ఇంటెన్స్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అనేది అర్ధ‌మ‌వుతోంది. శక్తికాంత్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, లక్ష్మీకాంతం కనికే సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ‘రేంజ్’ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ చివరి వారంలో ప్రారంభం కానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-