వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ఆగ్రహం

సినిమా వాళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సినిమా వాళ్లను బలిసింది అనడం బాధాకరమని… నిజనిజాలు తెలియకుండా ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేసింది. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని.. మిగతా సినిమాలు నష్టపోవడం జరుగుతుందని నిర్మాతల మండలి వివరించింది.

Read Also: సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారు: వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి

పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్ట్‌లకు పని కల్పిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సినిమాలు తీసిన నిర్మాతలు ఆస్తులు కూడా అమ్ముకున్న సందర్భాలున్నాయని నిర్మాతల మండలి గుర్తుచేసింది. కొంతమంది నిర్మాతలు.. నిర్మాతల మండలి నుంచి నెలకు రూ.3వేలు పెన్షన్ తీసుకుంటున్నారంటే… పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపింది. తక్షణమే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సినిమా వాళ్ల గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ఆగ్రహం

Related Articles

Latest Articles