ప‌వ‌న్‌ను క‌లిసిన తెలుగు సినీ నిర్మాత‌లు…

జ‌న‌సేన అధినేత‌, సినీ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాత‌లు క‌లిశారు.  దిల్ రాజు, డీవివి దాన‌య్య‌, సునీల్ నారంగ్‌, బ‌న్నీ వాసులు ఈరోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి వెళ్లారు.  సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న స‌మ‌స్య‌ల‌పై నిర్మాత‌లు ప‌వ‌న్‌తో చర్చించారు.  ఆన్‌లైన్ టికెట్ల వ్య‌వ‌హారంపై గ‌త కొన్ని రోజులుగా ర‌గ‌డ జ‌రుగుతున్న‌ది.  సినిమా వ్యవ‌హారం కాస్త రాజ‌కీయ రంగు పులుముకున్న సంగ‌తి తెలిసిందే.   ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాత‌లు రంగంలోకి దిగారు.  నిన్న‌టి రోజున ఏపీ మంత్రితో చ‌ర్చ‌లు జ‌రిపిన సినీ నిర్మాత‌లు, ఈరోజు ప‌వ‌న్‌ను క‌లిసి సినీ రంగంలో ఉన్న స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించారు. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించే అవ‌కాశం ఉంది.  

Read: 15 రోజుల్లోనే కొత్త పార్టీ… పావులు క‌దుపుతున్న అమ‌రీంద‌ర్ సింగ్‌…

-Advertisement-ప‌వ‌న్‌ను క‌లిసిన తెలుగు సినీ నిర్మాత‌లు...

Related Articles

Latest Articles