తెలుగు అకాడమీలో తవ్విన కొద్దీ బయట పడుతున్న అక్రమాలు…

తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ స్కాం లో తవ్విన కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఈ స్కాం కు సంబంధించి ఆరుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీ లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రమేష్ ని కూడా సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా నివేదిక సమర్పించింది. తెలుగు అకాడమీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిధుల గోల్మాల్ జరిగిందని కమిటీ తేల్చింది. అంతేకాకుండా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించారని పేర్కొంది. స్కాం కు ఉద్యోగులకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఇదిలా ఉంటే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి ఆరు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది . చంచల్గూడ జైల్లో ఉన్న మస్తాన్ వలి ని రేపు సిసిఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించ పోతున్నారు . మరొకవైపు స్కాంలో కీలక పాత్ర పోషించిన ఆరుగురిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు . మస్తాన్ వలీ తో పాటుగా ఆరుగురు కలిసి ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్ లను కొట్టేసి నట్టుగా సీసీఎస్ అధికారులు తేల్చారు . ఇందులో భాగంగా శ్రీనివాస్, రాజ్ కుమార్, సోమశేఖర్ లతో పాటుగా మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. మస్తాన్వలి అండ్ గ్యాంగులు కలిసి ప్రభుత్వ ఫిక్స్డ్ డిపాజిట్లను బ్యాంకుల నుంచి కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ గ్యాంగ్ కొన్ని ప్రభుత్వ డిపాజిట్లను కాజే చేశారని కూడా సిసిఎస్ విచారణలో బయట పడింది. చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

: Ramesh Vaitla

-Advertisement-తెలుగు అకాడమీలో తవ్విన కొద్దీ బయట పడుతున్న అక్రమాలు...

Related Articles

Latest Articles