తెలుగు అకాడమీ స్కాం: బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ ల గల్లంతుపై ప్రశ్నిస్తున్నారు.. యూనియన్, కెనరా బ్యాంక్ ల నుండి 8 కోట్ల ప్రైవేట్ డిపాజిట్ లను మస్తాన్ వలి & గ్యాంగ్ కాజేసింది.

ఒక్కఒక్కరిగా తెలుగు అకాడమీ సిబ్బందిని సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. రఫీ, రాజ్ కుమార్ లతో జరిపిన లావాదేవీలపై వివరాలను అధికారులు రాబడుతున్నారు. రెండున్నర గంటలుగా అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి అకౌంట్స్ అధికారి రమేష్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ ను సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజి మొత్తం ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోరారు. ఫుటేజి హార్డ్ డిస్క్ త్రిసభ్య విచారణ కమిటీ స్వాధీనంలో ఉందని అకాడమీ అధికారులు తెలిపారు.

-Advertisement-తెలుగు అకాడమీ స్కాం: బ్యాంకు సిబ్బందిని విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

Related Articles

Latest Articles