తెలుగు అకాడమి నిధులు మాయం.. ఎవరు దోచుకుపోయారు?

తెలుగు అకాడమీ నిధులు ఎక్కడి వెళ్లాయి.. ఎవరు దోచుకుపోయారు.. నాలుగు నెలల కాలంలో 63 కోట్ల రూపాయల నిధులు అదృశ్యమయ్యాయి.. ఈ నిధుల గోల్మాల్ వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. ప్రైవేట్ కోపరేటివ్ బ్యాంకు పాత్ర ఎంత వరకు ఉంది.. యూనియన్ బ్యాంకు నుంచి డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు. ఉన్నతాధికారుల నకిలీ లెటర్స్ తో 63 కోట్ల రూపాయలు చీటర్ దోచుకున్నారు. అయితే కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. పాత్రధారి ఎవరు. కథను నడిపించిన వారు ఎవరు.. నాలుగు నెలలుగా జరిగిన తతంగం ఏంటి. తెలుగు అకాడమీ లో ఉన్న సిబ్బంది పాత్ర ఎంత వరకు.. బ్యాంకు అధికారుల పాత్ర ఏ మేరకు ఉందన్న దానిపై పోలీసుల విచారణ చేస్తున్నారు. తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ పైన సీసీఎస్ లో మూడు కేసులు నమోదు చేశారు . నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఒకటి కాదు.. వంద కాదు ఏకంగా కోట్లు. ఏ అకౌంట్ లో ఎంతున్నాయో! ఎన్ని డబ్బులు ఎటువెల్లాయో అంతా అయోమయం. హైదరాబాద్ తెలుగు అకాడమిలో నిధులమాయం మిష్టరీ గా మారింది. అకాడమి ఉద్యోగుల చేతివాటమా? బ్యాంకు ఉద్యోగుల బరితెగింపా ఎటు పాలుపోని పరిస్థితి. కోట్ల నిధుల దారిమల్లింపుపై దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం సైతం ఈ ఇష్యూ ను సీరియస్ గా తీసుకుంది. తెలుగు అకాడమీ కోట్ల రూపాల హైదరాబాద్ తెలుగు అకాడమి నిధుల దారిమల్లింపు కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడెమీ లో నిధులు గోల్ మాల్ పై సిసిఎస్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. కార్వన్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 43 కోట్లు, సంతోష్ నగర్ బ్రాంచ్ నుండి మరో పది కోట్లు, మరో పదికోట్లు ఇంకో బ్యాంకు నుండి బదిలీ అయినట్టు తెలుగు అకాడమి గుర్తించింది. అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి పిర్యాదుతో దర్యాప్తు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కాజేసిట్లు ఇప్పటికే గుర్తించారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన నగదును సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు మొత్తం తెలుగు అకాడమీ లో ఉన్న 213 కోట్ల రూపాయలు లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికీ వాటా 125 కోట్లు ఇవ్వడానికి సిద్దం అయ్యింది. 43 కోట్లు విత్ డ్రా కి ప్రయత్నం చేయగా ఆసలు బ్యాంక్ లో డబ్బులు లేవు అని తెలిసింది. సెప్టెంబరు 22 వ తేదిన బ్యాంక్ డబ్బులు కోసం తెలుగు అకాడెమీ నుంచి బ్యాంక్ కి వెళ్ళిన అధికారులకు నిధులు లేవు అని బ్యాంక్ మేనేజర్ చెప్పటంతో విషయం వెలుగు చూసింది. దీంతో తెలుగు అకాడెమీ డైరక్టర్ సోమి రెడ్డీ సిసిఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతికి పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సిసిఎస్ పోలీసులు ఇప్పటివరకు 63 కోట్లు ఇతర అకౌంట్స్ కి బదిలీ అయ్యాయని గుర్తించారు. ఇదంతా అకాడమీకి చెందిన కొందరు ఉద్యోగులు బ్యాంక్ అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్టు పోలీసుల అనుమానం. ముగ్గురు ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. తెలుగు అకాడమి నిధుల మాయం స్కాం ఇంటిదొంగల పనే అని క్లారిటీకి వచ్చారు పోలీసులు. కాని ఆ దొంగలెవరు? ఆదొంగల వెనకున్న గజ దొంగలెవరు? త్వరలోనే తేల్చనున్నారు సైబర్ క్రైం పోలీసులు.

– రమేష్ వైట్ల

-Advertisement-తెలుగు అకాడమి నిధులు మాయం.. ఎవరు దోచుకుపోయారు?

Related Articles

Latest Articles