వాతావరణ సూచన : తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు

తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 18°N అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉన్నది. జులై 23న వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో ఎల్లుండి చాలా ప్రదేశాల్లో వచ్చే అవకాశములు వున్నవి.

వాతావరణ హెచ్చరికలు

రేపు భారీ వర్షాలు ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణాలో ఒకటి రెండు ప్రదేశాల్లో కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నవి. రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశాల్లో వచ్చే అవకాశములు వున్నవి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-