తెలంగాణ వాతావరణ సూచన…

నిన్నటి ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి / షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 2.1కిమీ నుండి 5.8 కిమీ మధ్య వుంది. అల్పపీడనం ఈ నెల 11వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం & వాయువ్య బంగాళా ఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర ఏర్పడే అవకాశం వుంది. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశాల్లో ఎల్లుండి అనేక ప్రదేశాల్లో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణ హెచ్చరికలు:-

ఈరోజు,రేపు భారీ వర్షములు ఒకటి, రెండు జిల్లాలలో ఒకటి,రెండు ప్రదేశములలో, భారీ నుండి అతి భారీ వర్షములు ఎల్లుండి ఒకటి, రెండు ప్రదేశాల్లో తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశములు వున్నవి. రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి*

ఈ నెల 11వ తేదీన ఏర్పడే అల్పపీడన ప్రభావం వలన తెలంగాణా రాష్ట్రంలో 11,12,13 తేదీలలో విస్తారంగా వర్షాలు వచ్చే అవకాశములు వున్నవి. అతి భారీ వర్షములు కూడా కొన్ని జిల్లాలలో ఒకటి రెండు జిల్లాలలో వచ్చే అవకాశములు ఉన్నవి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-