రాగల 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు…

నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈనెల 21వ తేదీన ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (19,20,21వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణ హెచ్చరికలు:-

ఈ రోజు (19వ.తేదీ) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-