తెలంగాణ వాతావరణ సూచన…

ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసరప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరియు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక దాని పరిసర ప్రాంతాల నుండి దక్షణ కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కి మి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి

రాగల 3 రోజులు (06,07,08వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు మరియు ఈదురగాలులతో కూడిన తేలికపాటి  నుండి మోస్తరు వర్షములు ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణహెచ్చరికలు

ఈ రోజు,ఎల్లుండి (06,08వ.తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురగాలులు (గంటకి 30 నుండి 40కిమి వేగం)తో (ముఖ్యముగా ఉత్తర, మధ్య,దక్షిణ తెలంగాణా జిల్లాలలో) మరియు రేపు(07వ తేదీ) ఉరుములు, మెరుపులు, ఈదురగాలులు (గంటకి 30 నుండి 40కిమి వేగం) మరియు వడగండ్లతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షములు (ముఖ్యముగా ఉత్తర, మధ్య,దక్షిణ తెలంగాణా జిల్లాలలో) ఒకటి,రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-