తెలంగాణలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన సీఈసీ

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా-2022ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన అప్లికేషన్‌లను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈమేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474, మహిళా ఓటర్లు 1,50,98,685, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారు.

ఓటర్ల జాబితాలో 18-19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2 లక్షలు పెరిగినట్లు వివరించింది. మొదటి సారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా నేరుగా ఇళ్లకు పంపుతామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Related Articles

Latest Articles