ఎల్‌. రమణ తెరాసలోకి రావడానికి సానుకూలం: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్ఎస్ లో చేరడం దాదాపు ఖాయం అయింది. ఈరోజు సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్‌.రమణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ… ‘ఎల్‌.రమణ అంటే కేసీఆర్‌కు అభిమానం అంటూ చెప్పుకొచ్చారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ తెరాసకు అవసరమన్నారు. రమణను తెరాసలోకి రావాలని కేసీఆర్‌ ఆహ్వానించారు. రమణ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలంగాణలో తెదేపా నిలబడే పరిస్థితి లేదు’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-