తెలంగాణ స్పీకర్ సవాల్… రాజీనామా చేస్తా..?

కామారెడ్డి జిల్లా.. బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం లో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలోనే ఉంది. కానీ ఆ అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని అడిగారు. అలా నిరూపిస్తే ఉంటే రాజీనామా చేస్తా అన్నారు. మేము ప్రజలనే నమ్ముకున్నాం , ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజలతోనే సాధ్యం అవుతుంది. గెలుపు ఓటముల గురించి మాట్లాడే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. కానీ నోరు ఉంది కదా… మైకు ఉంది కదా… అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు వినడానికి సిద్ధంగా లేరు అని హెచ్చరించారు స్పీకర్ పోచారం.

Related Articles

Latest Articles

-Advertisement-