స్కూళ్ల రీఓపెన్..? క్లారిటీ ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ

కరోనా మహమ్మారి దెబ్బకు స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి.. ఫస్ట్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత.. అక్కడక్కడ మళ్లీ తెరిచే ప్రయత్నాలు చేసినా.. మళ్లీ కోవిడ్‌ పంజా విసరడంతో.. అంతా వెనక్కి తగ్గారు.. ఇక, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ స్కూళ్లు తెరిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి… చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుందని.. టీచర్లు, స్కూల్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసి.. మళ్లీ భౌతిక తరగతులు ప్రారంభించుకోవచ్చు అనే సంకేతాలు ఇస్తున్నారు వైద్య నిపుణులు. దీంతో త్వరలోనే తెలంగాణలో స్కూళ్లు, విద్యాసంస్థలు రీఓపెన్‌ అవుతాయనే ప్రచారం సాగుతోంది.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ.

పాఠశాలలు భౌతిక తరగతుల నిర్వహణపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాధనలు సిద్ధం చేయలేదని స్పష్టం చేసింది విద్యాశాఖ.. దానిపై ఎలాంటి చర్చలు కూడా సాగడం లేదని క్లారిటీ ఇచ్చింది.. ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో ఇప్పుడు చెప్పలేమని ప్రకటించింది. కాగా, ప్రభుత్వం ఆదేశాల మేరకే పాఠశాలల్లో భౌతిక తరగతులు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. జులై ఒకటి నుండి భౌతిక తరగతులు ప్రారంభించాలని అనుకున్నా.. కరోనా థర్డ్‌ వేవ్‌ భయంతో మళ్లీ వెనకడుగు వేసింది ప్రభుత్వం.. ప్రస్తుతం ఆన్‌లైన్‌, డిజిటల్‌ పద్ధతిలోనే బోధన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-