నేడు తెలంగాణ పాలిసెట్ పరీక్ష…

నేడు తెలంగాణలో జరగనున్న పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఈ పరీక్షకు లక్ష 2వేల496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షా జరగనుంది. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పరీక్ష ఆఫ్లైన్(పెన్,పేపర్,పెన్సిల్)లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు పది గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతించనున్నారు. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ అని స్పష్టం చేసారు. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ర్యాంక్ ల ద్వారా… పాలిటెక్నిక్ కళాశాలలు, బాసర ఐఐఐటీ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ జరగనున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-