గణేష్ నిమజ్జంపై గందర గోళం : సుప్రీం కోర్టులో తెలంగాణ పిటీషన్‌ !


గణేష్ నిమజ్జంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశామని ఆయన వివరించారు. మరొక రోజులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని… హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తున్నామన్నారు. ట్యాంక్ బండ్ సహా గ్రేటర్ పరిధిలో అనేక లేక్స్ లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని… హుస్సేన్ సాగర్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామనటం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. వాళ్ళ అభిప్రాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని… గణేష్ చతుర్థికి దేశంలోనే హైద్రాబాద్ ది ప్రత్యేక స్దానం‌ ఉందన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందని తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-