వైఎస్‌ ఆకాంక్ష నెరవేర్చేందుకు పనిచేస్తాం-రేవంత్‌రెడ్డి

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో వైఎస్‌ చిత్రపటానికి నివాళులుర్పించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. వైఎస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే వైఎస్సార్‌ ఆకాంక్ష అని తెలిపిన రేవంత్… వైఎస్సార్ ఆకాంక్ష నెరవేర్చే దిశగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తుందన్నారు.. ఇక, కృష్ణా నది జలాల పంపకం విషయంలో వివాదాలపై స్పందించిన రేవంత్.. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీ నీళ్లు కేటాయించారని.. ఏపీకి, తెలంగాణ మధ్య నీటి వివాదాలు వస్తే.. పునర్విభజన చట్టంలో అపెక్స్ కమిటీ.. బోర్డులు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోను అని కేసీఆర్‌ అన్నారు.. కానీ, పార్లమెంట్ లో టీఆర్ఎస్‌ ఎంపీలు సెంట్రల్ హాల్ కి పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ఎంపీ సంతోష్ రావు… సపరేట్ గా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. కానీ, కృష్ణా నదిలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదని మండిపడ్డారు.

Related Articles

Latest Articles

-Advertisement-