Whats Today Updates 23.07.2022
1. నేడు యానాంలో కేంద్ర బృందం పర్యటించనుంది. వరద నష్టంపై క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలించనుంది.
2. నేడు శ్రీశైలం ప్రాజెక్ట్‌కు మంత్రి అంబటి రాంబాబు రానున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.
3. నేడు ఆగస్ట్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదల కానుంది. ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌లో దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగార ధర రూ.46,400లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,620లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 61,600లుగా ఉంది.