రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలి. డిసెంబర్ నాటికి అందరికి వాక్సిన్ ఇస్తాం అని తెలిపారు. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలి. కరోనాతో చనిపోయిన,సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికి పీఎం భీమా యోజన అందుతుంది. కరోనాతో చనిపోతున్న వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం ఇన్సూరెన్స్ వర్తింపజేస్తుంది. చుట్టుపక్కల ,బంధువులో ఎవరైనా అలా చనిపోతే వారందరికీ అవగాహన కల్పించండి. సుకన్య సమృద్ధి గర్ల్ చైల్డ్ కు బంగారు భవిష్యత్తు ఇస్తుంది,దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. వ్యాక్సిన్ కు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మీ సమీప వాక్సిన్ సెంటర్ లో ఆధార కార్డుతో వెళ్తే వాక్సిన్ వేస్తారు. బీజేపీ కార్యకర్తలు నగరంలోని అన్ని బస్తీల్లో ప్రజలని వీటిల్లో భాగస్వామ్యం చేస్తారు అని పేర్కొన్నారు.