తెలంగాణ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది… ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోన్న ఆర్టీసీ.. ఇప్పుడు న్యూఇయర్ కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త సంవత్సరం గిఫ్ట్‌గా.. అంటే 2022 జనవరి 1వ తేదీన.. తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది ఆర్టీసీ..
Read Also: మొరాయించిన రవాణాశాఖ సర్వర్.. ట్యాక్స్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి..
కాగా, న్యూ ఇయర్ వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది… డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు… హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో న్యూ ఇయర్ ఈవెంట్లను నిర్వహించే ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ లాభాల బాట పట్టించారు.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ఓ ట్రాక్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే.