WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Trs Focus On Development In Huzurabad

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ తారకమంత్రం!

Updated On - 05:35 PM, Wed - 6 October 21
By Manohar
అభివృద్ధే టీఆర్‌ఎస్‌ తారకమంత్రం!

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ హోరా హోరీ ప్రచారం చేస్తున్నాయి. గులాబీ పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పోలింగ్‌ నాటికి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపుతట్టాలని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను హైకమాండ్‌ ఆదేశించింది.

ఇటు అధికార టీఆర్‌ఎస్‌..అటు సిట్టింగ్‌ ఎమ్మెల్యే , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎలక్షన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ప్రజలు ఈ హై ఓల్టేజీ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయం ఎవరికి..? అభివృద్ధి వృద్ధి మంత్రమా..ఆత్మగౌరవమా? హుజూరబాద్‌ ఓటర్ల ముందు ఈ రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. దేనికి ఓటేస్తారన్నది అక్టోబర్‌ 30 న తెలుస్తుంది.

హుజూరాబాద్‌లో జరిగిదే ముక్కోణ పోటీయే అయినా ..ఫైట్‌ ప్రధానంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే ఉంటుంది. అందుకే ఈ రెండు పార్టీలు తమ నినాదాలను అత్యంత బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఆత్మగౌరవ నినాదాన్ని నమ్ముకోగా.. టీఆర్‌ఎస్‌ మాత్రం సంక్షేమ పథకాలు..అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్న ఆశతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి ఓ అభివృద్ధి నివేదికను కూడా రూపొందించనుంది గులాబీ పార్టీ. నియోజవకర్గంలో అమలవుతున్న అభివృద్ది పనులు…భవిష్యత్‌లో అమలు చేయబోయే కార్యక్రమాలను వివరించేలా ఈ నివేధిక సిద్ధమవుతోంది.

నివిదేక సిద్ధమైన తరువాత పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో వివరిస్తారని గులాబీ నేతలు అంటున్నారు. తమది అభివృద్ధి ఎజెండా అని.. ఓటర్లకు ఒకటికి రెండు సార్లు దానిని వివరిస్తామంటున్నారు వారు. అయితే డెవలప్‌మెంట్‌ నినాదం కారు పార్టీ కొత్తగా ఇప్పుడే చేస్తున్న ప్రచారం కాదు. ఏ ఎన్నికల్లో అయినా టీఆర్‌ఎస్‌ ఇదే చెబుతోంది. అయితే ఇప్పుడు మరింత తీవ్రంగా ప్రజలకు విషయం చెప్పాలన్నది దాని ప్లాన్‌. అందులో భాగమే ఈ నివేదిక. ఈ రిపోర్టు రూపకల్పనకు పార్టీ నాయకత్వం స్థానిక నేతల సాయం తీసుకుంటోంది. ఏ ఏ ప్రభుత్వ పథకం నుంచి ఎంత మంది లబ్ధిపొందారు. ఏ సామాజిక వర్గానికి ఎంత లబ్ధి చేకూరింది వంటి వివరాలను సేకరించింది.

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పయ్‌ వేల మంది ఓటర్లున్నారు. వీరిలో దాదాపు లక్షకు పైగా ఓటర్లు ప్రత్యక్షంగానో …పరోక్షంగానో ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందినవారే. కొన్ని కుటుంబాలయితే ఒకటి కన్నా ఎక్కువ స్కీంల నుంచి లబ్ధి పొందుతున్నాయి. అందుకే ఇంటింటికి వెళ్లి ఈ సంగతి వివరిస్తే గెలుపు తమదే అన్నది గులాబీ పార్టీ స్కెచ్‌.

టీఆర్‌ఎస్‌ గెలుపు వ్యూహాలు బాగానే రచిస్తోంది. అయితే వాటిని ఎంత వరకు అమలుచేస్తారన్నది చూడాలి. ముఖ్యంగా ఆ పార్టీకి గ్రామ స్థాయిలో నిరుద్యోగ యువత ప్రతికూలంగా మారుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు నిరుద్యోగాన్ని హైలైట్‌ చేస్తున్నాయి. ఈ ఏడేళ్ల లో నిరుద్యోగం ఎలా పెరిగిపోయిందో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను వేదికగా చేసుకుని రాష్ట్ర సర్కార్​పై తమ నిరసన గళం వినిపించాలనుకుంటున్నారు నిరుద్యోగులు. సర్కార్‌ తీరుకు నిరసనగా నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నట్టు సమాచారం. కోవిడ్‌ నిబంధనలంటూ తమని గందరగోళానికి గురిచేసి వెనక్కి పంపారని పలువురు వాపోతున్నారు. ఉప ఎన్నికలో ఎక్కువ మంది నామినేషన్లు వేయకుండా అడ్డుకునేందుకే టీఆర్​ఎస్​ ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు. ఐతే నామినేషన్లకు ఇంకా గడువు వుంది.

తమను ఉద్యోగాల నుంచి తీసేసినందుకు నిరసనగా హుజూరాబాద్ బై ఎలక్షన్​ లో వెయ్యి మందిమి పోటీ చేస్తామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వంద మందిమి పోటీ చేస్తామని కళాకారులు, 200 మందిమి పోటీ చేస్తామని రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.

మరోవైపు, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాద‌వ్ ఇంటింటా ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఊరూరా డ‌ప్పు చ‌ప్పుళ్లు, మంగ‌ళ‌హార‌తులు, కోలాటాల‌తో జనం స్వాగ‌తం ప‌లికారు. ఆడ‌బిడ్డలు వీర‌తిల‌కం దిద్ది ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఆయనతో ఆయన భార్య, ఇతర మహిళా నేతలు ఇంటింటా తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి ఓటు అడుతున్నారు. ఇంకో పక్క బీజేపీ కూడా ఇదే రేంజ్‌లో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. మరి ఈ ఎన్నికల సమరంలో ఎవరు గెలుస్తారో చూద్దాం!!

  • Tags
  • development
  • huzurabad
  • huzurabad by election
  • telangana
  • TRS

RELATED ARTICLES

Hyderabad:టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థలపై కేఏ పాల్ ఫైర్.. వారికా సీట్లు..?

TRS : టీఆర్ఎస్ లో గ్రూప్ వార్ కి చెక్ పడినట్టేనా?

TRS : ఉప్పల్ లో స్పీడ్ పెంచిన లక్ష్మారెడ్డి.. పార్టీ మారబోతున్నారా?

TSRTC:ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్… 5రూ.ల‌కే బ‌స్సు ప్రయాణం!

Kinnera mogulaiah:‘పద్మ శ్రీ’ వెనక్కి ఇచ్చేస్తా..!

తాజావార్తలు

  • Supreme Court : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు..

  • Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసు.. సుప్రీంకోర్టు జోక్యం..

  • Niharika: లిప్‌లాక్ ఫోటోతో ఆ రూమర్లకు చెక్

  • Financial crisis : మీ తలపై లక్ష రూపాయలు అప్పు! మీకు తెలీకుండా ఆ అప్పు పెరిగిపోతుందని తెలుసా?

  • YSR Sanchara Pashu Arogya Seva: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన జగన్

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions