తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి.
తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు బాధపడ్డారు. జడ్జీలు మథన పడ్డారు. బీజేపీలోకి వెళ్లే అవకాశం నాకు దక్కింది. ప్రజలలోకి వెళ్లి నీ పాలనపై పోరాడుతాం. సమాజంలోని ఉద్యమకారులంతా ఒకటవుతున్నారు.
అంతకుముందు తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ , తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకు పార్టీ సభ్యత్వ రసీదు ఇచ్చి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తరుణ్ చుగ్. జర్నలిస్ట్ నవీన్ కుమార్ సమస్యలపై పోరాడే వ్యక్తి. నవీన్ కుమార్ కు బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాను. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబపాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురుచూస్తుంటారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గణనీయంగా పట్టభద్రుల ఓట్లు సాధించారు. ప్రజా సమస్యలపై యాత్రలు చేస్తుంటే ఎంపీలపై దాడులు,కేసులు పెడుతున్నారు. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటుందన్నారు తరుణ్ చుగ్.