నల్గొండ జిల్లాలో నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ కేటీఆర్.. ప్లీనరీలో కేసీఆర్ మాటలు చూస్తుంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారెమో..? అని ఆయన వ్యాఖ్యానించారు. ప్లీనరీలో కేసీఆఆర్.. ఎన్టీఆర్‌ని స్మరించారన్నారు. కేసీఆర్ తెలంగాణలో పోత్తుల గురించి ఆలోచిస్తున్నారు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నీ ముచ్చింతలకి ఎస్‌పీజీ వాళ్ళు రావద్దు అని చెప్పారు అని ఎప్పుడో చెప్పిన.. మీరే వినలేదు.. కేటీఆర్ మీడియా ముందే చెప్పారన్న రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారన్నారు.
రాజకీయంగా భయం..భయంగా ఉన్నారని, కేసీఆర్ ఎక్కువ ఊహించుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. జగన్..మోడీ..కేసీఆర్.. అసద్ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. ఏడు పార్లమెంట్ నియోజక వర్గాల నుండే రాహుల్ సభకు ఎక్కువ జన సమీకరణ జరుగుతుందని వెల్లడించారు. కోమటిరెడ్డికి నాకు మధ్య పంచాయితీ పెట్టాలని చూసినా ఉపయోగం లేదని, ఇద్దరి మధ్య అవగాహన ఉందన్నారు. పార్టీలో మా ఇద్దరి మధ్యనే ఎక్కువ అవగాహన ఉందని, ఇద్దరం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటామన్నారు. నల్గొండలో వెంకన్న వాళ్ళ నాయకులకు సాగర్ వెళ్ళాలి అని చెప్పి పంపించారని, వెంకన్న కూడా నాకు చెప్పాడని రేవంత్ స్పష్టం చేశారు.