బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసులో సిద్ధార్థ పితాని అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌లో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ముంబైకి తరలించింది ఎన్సీబీ. సుశాంత్ ప్లాట్‌లో మూడేళ్లపాటు ఉన్న సిద్ధార్థ్.. డ్రగ్స్ కేసులో సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించింది ఎన్సీబీ. ఆత్మహత్యకు ముందు చివరి సారి సిద్ధార్థ్‌తో మాట్లాడారు సుశాంత్. సుశాంత్‌కు పీఆర్ మేనేజర్‌గా కూడా సిద్ధార్థ్ పనిచేశారు. సిద్ధార్థ్ పితానిని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మే 26న ముంబై NCB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సుశాంత్ కేసులో విచారణ కోసం తన కొడుకును ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది సిద్ధార్థ్ తల్లి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.