తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల నేపథ్యం లో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఒక ఎంపీటీసీ సభ్యుడితో ఫోన్‌లో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లయిన ఎంపీటీసీ సభ్యులపైనా, నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ నాయకుడిపైనా మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆడియో లీక్ అయి సంచలనం సృష్టించింది.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వ ర్లుకు ఫోన్ చేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ”అవతలి వాళ్లిచ్చే రూ.50 వేలే కావాల్నా? మేమిచ్చేది అవసరం లేదా?’’ అంటూ ప్రశ్నించారు. తాను ఎవరినీ జమ చేయలేదని, తన వద్దకు వస్తే తీసుకోలేదని వెంకటేశ్వర్లు చెప్పే ప్రయత్నం చేశారు. డబ్బులిచ్చేది మనమే అంటూ ఈశ్వర్ అన్నారు.