Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Agnipath Protests
  • Congress Satyagraha Deeksha
  • Covid 19
  • President Election
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Highway 163 Expansion Disappear 900 Banyantrees

హైవే 163 విస్తరణ.. 900 మర్రి చెట్లకు కష్టకాలం

Updated On - 11:26 AM, Sun - 12 December 21
By GSN Raju
హైవే 163 విస్తరణ.. 900 మర్రి చెట్లకు కష్టకాలం

రంగారెడ్డి జిల్లాలో హైవే నెంబర్ 163 విస్తరణకు రంగం సిద్ధమయింది. అయితే ఈ రహదారిలో ఎక్కువగా మర్రి చెట్లు వున్నాయి. వీటికి వందల ఏళ్ళ చరిత్ర వుందని పరిశోధకులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. హైవే విస్తరణ కారణంగా వాటిని తిరిగి వేరేచోట పాతాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ఈ మర్రి చెట్లు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ రహదారిపై ఇరువైపులా 900 మర్రిచెట్లు వున్నాయి. వాటిని భద్రంగా తీసి వేరేచోట భద్రపరచాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. వీటికి వందేళ్ళ చరిత్ర వుంది. రహదారికి ఇవి ఎంతో అందం తెచ్చిపెడుతున్నాయి. హైవేని విస్తరిస్తే ఇలాంటి అరుదైన చెట్లు కనుమరుగు అవుతాయంటున్నారు. చెట్లను నరకకుండా రహదారి నిర్మాణంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వున్న రహదారులు ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. బీజాపూర్‌ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్‌ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్‌ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి కేంద్రానికి తెలియచేశారు ప్రజాప్రతినిధులు.

ఈ రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరుగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ లు ఆస్పత్రులకు చేరేందుకు కూడా బాగా సమయం పడుతోంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను ఆమోదం లభించింది. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు రూ.928.41 కోట్లతో నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. తొలుత రూ.800 కోట్లతో రహదారి విస్తరణ పనులకు సంబంధించి అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.128 కోట్లకు పెంచారు. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్‌ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. రోడ్డు విస్తరణ పనులకుగాను 350 ఎకరాల మేర భూములను సేకరిస్తారు.

ఈ రహదారి ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో అందుబాటులోకి రానుంది. మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్‌, బీజాపూర్‌ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారి అందుబాటులోకి వచ్చింది. అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్‌పాస్‌ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. 46 కి.మీ పరిధిలో 6 భారీ అండర్‌పాస్‌ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్‌పాస్‌ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకువస్తారు. నాలుగు లేన్ల రహదారి కానుండడంతో అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తారు.

  • Tags
  • banyantrees
  • Chevella banyans
  • environment
  • highway extension
  • NH expansion project

RELATED ARTICLES

Netflix: సెట్ లో ప్రమాదం.. ఇద్దరు హీరోలు మృతి.. ఆరుగురికి గాయాలు

LIVE: హైదరాబాద్ లో సద్గురు.. భూమి రక్షణకు ఉద్యమం

Suryapet Car Accident: కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Mango Farmers: రుచి మధురం.. మామిడి రైతుకు చేదుమయం

Uttarakhand: లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి

తాజావార్తలు

  • Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికలు.. అభ్యర్థి ఎంపికలో బీజేపీ వ్యూహం అదేనా..?

  • Viral News: వామ్మో.. కిలో టీ పొడి ధర అక్షరాలా రూ.లక్ష

  • Vijaya Kanth: కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం విషమం.. ట్వీట్ చేసిన రజినీకాంత్

  • Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

  • Elon Musk: అమ్మాయిగా మారిన ఎలన్ మస్క్ కుమారుడు.. పేరు మార్పు కోసం దరఖాస్తు

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions