వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వరప్రసాద్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారు. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ అతనికి సహకరించిన మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే గతంలో కూడా పీవీపీపై పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. తన వెంచర్‌లో నిర్మించిన విల్లాలు కొనుకున్నవారు వాటిని రిమోడలింగ్ చేయకూడదని, ఓ సారి విల్లా కొనుగోలు చేసిన వారు రినోవేషన్ చేస్తే వారితో కూడా గొడవలు జరిగాయి. దీంతో వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు కోసం పీవీపీ ఇంటికి రాగా పోలీసులపైకి కుక్కలను వదలడంతో ఆ ఘటన వివాదస్పదంగా మారింది. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది.