మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఎన్‌కౌంటరే..!

సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేని కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారం, హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.. నిందితుడిని పట్టుకోవడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు.. ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులను రాజకీయ నేతలు, ప్రజాసంఘాల నాయకులు, తాజాగా.. సినీ నటుడు మంచు మనోజ్‌ కూడా పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇక, ఈ ఘటన జరిగినప్పటి నుంచి బాధితులు కుటుంబసభ్యులు, స్థానికులది ఒకే డిమాండ్.. ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందేనని.. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. సైదాబాద్ కేసులో నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనన్నారు.. సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తామని వెల్లడించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాల్లారెడ్డి.. ఇక, బాధిత కుటుంబాన్ని త్వరలోనే పరామర్శించనున్నట్టు తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-