తొడగొట్టి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి..

తెలంగాణలో మరోసారి సవాల్‌ పర్వం తెరపైకి వచ్చింది… మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ చేశారు. ఇక, దీనిపై మంత్రి మల్లారెడ్డికి చిర్రెత్తుకొచ్చింది.. ఆ వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి.. రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు మంత్రి మల్లాడిరెడ్డి.. పీసీసీ చీఫ్‌పై ఏకవచన వ్యాఖ్యలతో విరిచుకుపడ్డ మల్లారెడ్డి.. రాజీనామా చేద్దాం.. ఎన్నికలకు పోదాం అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.. ఆవేశంతో ఊగిపోయిన మల్లారెడ్డి.. ప్రెస్‌మీట్‌లో తొడగొట్టి మరీ రేవంత్‌కు సవాల్‌ విసిరారు.. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్‌ సవాల్‌ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా.. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్‌ పీసీసీ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి.. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ అని రేవంత్‌రెడ్డికి మల్లారెడ్డి సవాల్‌ విసిరారు… మల్లారెడ్డి సవాల్‌ విసిరిన విధానం.. ఆయన వ్యాఖ్యలను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..

-Advertisement-తొడగొట్టి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి..

Related Articles

Latest Articles