రేవంత్‌పై కేటీఆర్‌ సెటైర్లు.. చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు..!

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ… సోనియాను ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఆయనే గతంలో సోనియాను బలి దేవత అన్నారని వ్యాఖ్యానించారు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. టీడీపీ పాత వాసనలు ఇంకా పోలేదని.. టీపీసీసీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కామెంట్ చేశారు.. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ.. ఇప్పుడు నీతులు చెబుతున్నాడంటూ మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలంటున్నాడు.. నువ్వు మారావు కదా ఏ రాయితో కొట్టాలి అని ప్రశ్నించారు కేటీఆర్… రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కూడా అదే చేశారు ?ఆయన్ను కూడా రాయితో కొట్టాలా ? అని ప్రశ్నించారు.

ఇక, చిన్న పదవి రాగానే పీఎం పదవి వచ్చినట్టు బిల్డప్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్.. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ తీరు అని.. కుసంస్కారి… మొరిగే కుక్కలను పట్టించుకోవద్దన్నారు.. మరోవైపు.. ఇక తెలంగాణ పాదయాత్రల సీజన్‌ రాబోతుందన్నారు కేటీఆర్.. పాదయాత్రలు చేయండి… స్వాగతం.. కరోనా తర్వాత ఆరోగ్యం కూడా మంచిగా అవుతుందనంటూ సెటైర్లు వేశారు.. పాదయాత్రలతో పల్లెలు ఎట్లా ప్రగతి బాటలో పోతున్నాయో బండి సంజయ్ చూడాలన్న ఆయన.. ఆ గ్రామాల్లో జరిగిన అభివృద్ధి… ఎక్కడ అయిన బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతు బంధు ఉందా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.. బండి సంజయ్ చెప్పింది వాస్తవం అయితే… మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు ఎందుకు లేదు? రైతు బీమా ఎందుకు లేదు? కల్యాణ లక్ష్మీ ఎందుకు లేదు ? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు లేవు..? ఊరూరా తిరిగి ఈ ఏడేళ్లలో తెలంగాణ కు బిజెపి ఏం చేసిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-