ఎలాన్‌ మస్క్‌ని ఆహ్వానించిన కేటీఆర్‌.. ‘టెస్లా’కు మేం రెడీ..!

ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. వెంటనే ఈ అంశంపై స్పందించారు.. సోషల్‌ మీడియా వేదికగా ఎలన్‌మస్క్‌తో టచ్‌లోకి వెళ్లిన కేటీఆర్.. హే ఎలాన్‌.. నేను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రిని అంటూ పలకరించారు.. ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్‌, కామర్స్‌ మంత్రిగా తెలియజేస్తున్నాను.. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయని పేర్కొన్నారు.

Read Also: సీఎం జగన్‌, చిరు భేటీపై స్పందించిన నాగ్.. తప్పకుండా గుడ్‌న్యూస్‌..!

అంతే కాదు.. 2016 జూన్‌ 5వ తేదీన తాను చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు కేటీఆర్… ఆ ట్వీట్‌ ఏంటంటే..? గతంలో టెస్లా కారుని స్వయంగా నడిపారు కేటీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న టెస్లా మోడల్‌ ఎక్స్‌ కారుని అమెరికాలో ఓ ట్రయల్‌ వేసిన కేటీఆర్.. కారు బాగుంది.. కొత్తగా ఆలోచించిన ఎలాన్‌ మస్క్‌కి అభినందనలు తెలుపుతూ.. ఓ ట్వీట్‌ చేశారు.. ఆ ట్వీట్‌నే ఇప్పుడు రిట్వీట్‌ కూడా చేశారు కేటీఆర్.. కాగా, ప్రణయ్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్‌ వేదికగా “ఇండియాలో టెస్లా విడుదల గురించి తదుపరి అప్‌డేట్లు ఏమైనా ఉన్నాయా..? ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో లాంచ్ అయ్యే అర్హత టెస్లా కార్లకు ఉంది” అంటూ మస్క్‌ను ట్యాగ్ చేయగా.. దానిపై స్పందించిన ఎలాన్ మస్క్.. ప్రభుత్వంతో ఎదురవుతున్న చాలా సవాళ్లను అధిగమించేందుకు పని చేస్తున్నాం అంటూ రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే..

Related Articles

Latest Articles