అన్నీ సాధ్యం కాదు.. అవకాశం ఉన్న వరకు ప్రయత్నం-కేటీఆర్

శాసన మండలిలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్… మూతపడ్డ అన్ని పరిశ్రమలు తెరిపించడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చిన ఆయన.. అవకాశం ఉన్న వరకు ప్రయత్నం చేస్తామన్నారు.. ఇక, దేశంలో ఎక్కడా లేని విధంగా 1,32,890 ఉద్యోగాలు భర్తీ చేశామని.. 16 లక్షల ప్రైవేట్‌ ఉద్యోగాలు, 3 లక్షల ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించారు.. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా గుర్తుచేసిన ఆయన.. బీజేపీ మాట సాయం, మూట సాయం చేయడం లేదు.. కానీ, మన రాష్ట్రంలోని కొంత మంది నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐటీఐఆర్‌ను 2008లోకాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తే 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండి పూర్తి చేయలేకపోయింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐఆర్‌ విషయాన్ని అసలు పట్టించుకోలేదన్నారు.

ఇక, రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలం అయ్యిందని ఆరోపించారు మంత్రి కేటీఆర్.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.. కానీ, ఇవ్వడం మాట అటు ఉంచితే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. కేంద్రం రాష్ట్రానికి సహాయ నిరాకరణ చేస్తుందని కామెంట్ చేసిన ఆయన.. రాష్ట్రంలో మూత పడ్డ మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించడానికి నావంతు ప్రయత్నంగా సీఎం కేసీఆర్ తో ఈ విషయాన్ని చర్చిస్తాను అని శాసన మండలిలో తెలిపారు మంత్రి కేటీఆర్.

-Advertisement-అన్నీ సాధ్యం కాదు.. అవకాశం ఉన్న వరకు ప్రయత్నం-కేటీఆర్

Related Articles

Latest Articles